సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

KMM: కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో, ఉపాధి హామీ పథకం నిధుల నుంచి మంజూరైన ఈ రోడ్డు పనులను మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ అంతర్గత రహదారులను మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్థి జరుగుతుందన్నారు.