రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన
ATP: వజ్రకరూరు మండలం బోడుసానిపల్లి గ్రామంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంతకల్ రెవెన్యూ డివిజనల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. కుల వివక్షను రూపుమాపడం, అంటరానితనం నిర్మూలన, రాజ్యాంగం కల్పించిన హక్కులపై దళితులు, బలహీన వర్గాల ప్రజలలో అవగాహన కల్పించారు.