ప్రగతి పథంలో స్టేషన్‌ఘన్‌పూర్

ప్రగతి పథంలో స్టేషన్‌ఘన్‌పూర్

WGL: స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం ప్రగతిపథంలో పయనిస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నుంచి రూ.800 కోట్లు మంజూరు చేయించారు. ఈ ఏడాది మార్చి 25న నియోజకవర్గ కేంద్రంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే చొరవతో పలు పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యాయి.