షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు

షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు

WGL: పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. పొగలు గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, దుస్తులు, బియ్యం బస్తాలు, రూ.50,000 నగదు కాలిపోయాయని బాధితులు తెలిపారు. బాధితులు మాట్లాడుతూ.. భారీ నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.