ఇసుక రవాణాపై కలెక్టర్ కఠిన ఆదేశాలు
MBNR: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇసుక సరఫరా 100% ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు కేవలం "మన ఇసుక వాహనం" ద్వారానే బుక్ చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.