నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. కఠిన చర్యలకు డిమాండ్

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. కఠిన చర్యలకు డిమాండ్

KDP: జిల్లాలో ఐటీఐ (ఎలక్ట్రీషియన్) కోర్సు చేయకుండానే నకిలీ సర్టిఫికెట్లతో 38 మంది APSPDCLలో ఉద్యోగాలు పొందిన ఘటనపై NHRP ఫోరం జిల్లా అధ్యక్షుడు నరసింహులు తీవ్రంగా స్పందించారు. ఇది యువత భవిష్యత్తుతో ఆటలాడినట్టేనని ఆయన విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటివరకు పొందిన జీతాలను పూర్తిగా రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.