జిల్లా స్థాయి పోటీలకు తొమ్మిది మంది విద్యార్థుల ఎంపిక
SKLM: ఆమదాలవలస మండలం నిమ్మతోర్లవాడ జడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి 9 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హెచ్ఎం మెండ తులసిబాయి తెలిపారు. విద్యార్థులను పిడి తవిటమ్మ, ఉపాధ్యాయులు అభినందిస్తూ భవిష్యత్తు పోటీల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.