అన్న మృతి.. వదినను పెళ్లిచేసుకున్న మరిది!
అన్న మరణంతో ఒంటరిగా ఉంటున్న వదినను మరిది పెళ్లి చేసుకున్న ఘటన UP బదౌన్ జిల్లాలో జరిగింది. చిన్న వయసులో భర్తను కోల్పోయిన వదినను అలా చూడలేకపోయిన రాజేశ్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ అంగీకరించడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.