VIDEO: బడా గణపతికి భక్తుల తాకిడి

HYD: ఎంతో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుండగా రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బడా గణేష్‌ను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.