జిల్లాలో ఇంధన కొరత లేదు: జేసీ
KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోందని జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. మొత్తం 166 పెట్రోల్ బంకుల్లో రోజువారీ వినియోగానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం అవసరాలకు మించి నిల్వలు ఉండటంతో ఎలాంటి కొరతా లేదని చెప్పారు. ప్రజలు అపోహలకు లోనుకావద్దన్నారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి, నిల్వ చేయవద్దన్నారు.