'బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి'

NGKL: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన బీసీ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారు.