VIDEO: సిర్గాపూర్‌లో పోతరాజుల వినూత్న ప్రదర్శన
SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్ మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో పోతరాజులు శనివారం వినూత్న ప్రదర్శనలు చేశారు. ప్రధాన వీధిలో గుండ్రంగా ఉన్న అగ్ని జ్వాలలో పోతరాజులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్నారు. యాదవుల ఆధ్వర్యంలో కళాకారులు మల్లన్న స్వామి చరిత్రపై ఒగ్గు కథ కాలక్షేపాన్ని చేపట్టారు. స్థానికులు ఒగ్గు కథను శ్రద్ధగా విన్నారు.