ఉప్పల్‌లో స్పా కేంద్రాలపై పోలీసులు దాడి
MDCL: ఉప్పల్‌లోని పలు స్పా కేంద్రాలపై మల్కాజ్‌గిరి SOT పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా పలు ప్రాంతాల్లో స్పా కేంద్రాలు నడుపుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిర్వాహకుడు దశరథ్‌తో పాటు నిర్వాహకురాలు మహమ్మద్ నాదఫ్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.