తిరుపతి జిల్లాలోకి ఆ 3 మండలాలు విలీనం
TPT: జిల్లా విస్తీర్ణం పెరగనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తారనుకున్నా.. ఆ ప్రతిపాదన ఆగిపోయింది. దీంతో పెంచలకోన సైతం తిరుపతిలోకే వస్తుంది.