నేడు మల్లయ్య కొండకు ఆర్టీసీ బస్సులు
అన్నమయ్య: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్య కొండకు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం బుధవారం మూడు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్టు ఒకటో డిపో మేనేజర్ ఎం. వెంకటరమణారెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.