నేడు ఎనుమాముల మార్కెట్ బంద్
WGL: పట్టణంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు అమావాస్య సందర్భంగా గురువారం పూర్తిగా బంద్ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పంటలు తీసుకొని రావద్దని కోరారు. మార్కెట్‌లో కొనుగోలు, అమ్మకాలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. రేపు ఉదయం నుంచి మార్కెట్ సాధారణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు సహకరించాలని అధికారులు కోరారు.