సుల్తానాబాద్ మండలంలో పర్యటించిన కలెక్టర్

సుల్తానాబాద్ మండలంలో పర్యటించిన కలెక్టర్

PDPL: సుల్తానాబాద్ మండలంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం పర్యటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల్లో తనిఖీ చేశారు. రూ.12.50 లక్షలతో కొనుగోలు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎన్ఎస్ఈ యంత్రాలను కలెక్టర్ ప్రారంభించారు. సహకార సంఘం గోడౌన్‌ను, ఎరువుల షాప్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.