పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి

NDL: నందికొట్కూరులోని రవి బుక్ స్టోర్ దగ్గర ఉన్న సచివాలయం వారు సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్ తాలూకా రూ.7000లు అందజేశారు. ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన బైరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని లబ్దిదారులు ఆశీర్వదించారు.