SLBC టన్నెల్‌ను పరిశీలించిన రేవంత్

SLBC టన్నెల్‌ను పరిశీలించిన రేవంత్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో SLBC టన్నెల్ ప్రాంతం పరిశీలించారు. NGRI అధికారులతో కలిసి భూమి పొరల్లోని స్వరూపంపై సమీక్షించారు. ప్రత్యేక ట్రాన్స్‌మీటర్ గల NGRI హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. వారం రోజుల్లో అధికారులు సర్వే రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే ప్రారంభమైంది.