VIDEO: పట్టణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన మార్గంలో నడవాలని ప్రతిజ్ఞ చేశారు.