మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్ నివాళులు
HYD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్బంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరా పార్క్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో లేరని, భవిష్యత్తులో కూడా అలాంటివారు రారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని నివాళులర్పించారు.