నా గెలుపును ఎవరూ ఆపలేరు: నవీన్ యాదవ్
TG: తనపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏమాత్రం పనిచేయవని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేసిన నవీన్ యాదవ్.. తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ప్రజల మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. జనాలకు అన్ని విషయాలు తెలుసని.. ఎవరూ మోసపోయే పరిస్థితిలో లేరని తెలిపారు. ఈ సారి పోలింగ్ 60శాతం దాటే అవకాశం ఉందన్నారు.