కాత్యాయని అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి

కాత్యాయని అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి

 సిరిసిల్ల: వేములవాడ రాజన్న గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఏడవ రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారితో పాటు అమ్మవార్లను దర్శించుకుని సేవలో తరించారు. అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో,ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.