యుద్ధం ఎఫెక్ట్.. కలపకు భారీ డిమాండ్
VKB: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్ ఇబ్బందుల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో కలప వాడకం బాగా పెరిగింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న కట్టెల కోత మిల్లుల యజమానులు ధరలు పెంచేశారు. హోటల్లు, గృహావసరాలు, బేకరీల నిర్వాహకులు, శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి టన్నుల్లో విక్రయిస్తున్నారు. యుద్ధానికి ముందు సా మిల్లుల యజామానులు కేవలం గృహ సంబంధ వస్తువులు మాత్రమే తయారు చేసేవారు.