'Operation Mobi Track' సక్సెస్.. మొబైల్స్ రికవరీ

'Operation Mobi Track' సక్సెస్.. మొబైల్స్ రికవరీ

KDP: 'Operation Mobi Track'లో భాగంగా కడప పోలీసులు 8వ విడతలో రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్, IMEI ట్రాకింగ్ ద్వారా ఈ ఫోన్‌లను గుర్తించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 5877 ఫోన్‌లు రికవరీ చేశారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.