సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు పిల్లలు

సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు పిల్లలు

అనకాపల్లి: తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలురను తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ గణేష్ మంగళవారం తెలిపారు. అచ్యుతాపురం(M) కొండకర్లకు చెందిన బి.సందీప్ కుమార్ (14), తేజ(14) గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి వద్ద ఉన్న ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా రైలులో శ్రీకాళహస్తి వెళ్తున్నట్లు తెలుసుకున్నారు.