'విద్యార్థి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం'

'విద్యార్థి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం'

ELR: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని AISF జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్, కోశాధికారి ఎం.క్రాంతికుమార్ తెలిపారు. చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISF నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, హాస్టల్ సదుపాయాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని నేతలు అన్నారు.