TDP సమావేశంలో బాహాబాహీకి దిగిన తెలుగు తమ్ముళ్లు
NTR: కొండపల్లి TDP సమావేశంలో తెలుగు తమ్ముళ్ల గలాట చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగు తమ్ముళ్లు దాని ఆనవాళ్లు కూడా లేకుండా బీభత్సం సృష్టించారు. ఏకంగా పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగారు. సీనియర్ నాయకులు ఉన్నారన్న గౌరవం కూడా లేకుండా దుర్భాషలాడుకున్నారు. స్వార్థం కోసం పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.