'పొంగి పొర్లుతున్న వాగు.. దాటే ప్రయత్నం చేయొద్దు'

'పొంగి పొర్లుతున్న వాగు.. దాటే ప్రయత్నం చేయొద్దు'

RR: భారీ వర్షం కారణంగా షాద్ నగర్ పట్టణ పరిధిలోని అయ్యవారిపల్లి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో అక్కడ పోసిన మట్టి కొట్టుకుపోవడంతో వెళ్లడానికి వీలు లేకుండా ఉందని, వాహనదారులు వేరే గ్రామాల నుండి తమ గమ్యానికి చేరుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదభరితంగా వాగు ప్రవహిస్తుందని, వాగును దాటే ప్రయత్నం చేయవద్దని పేర్కొన్నారు.