ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
NRML: లక్ష్మణ్చందా మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మండలంలో 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఇందులో ఓ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది. ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు ప్రజలు బార్లు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలుచోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.