ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
AKP: యువత అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు పిలుపునిచ్చారు. మంగళవారం పాయకరావుపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జోగులు, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషిచేసిన మహానీయుడు అంబేడ్కర్ అన్నారు.