నగర పంచాయతీ ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ
కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిపై ఫేక్ సర్టిఫికెట్ల ఆరోపణలతో కమిషనర్ రవి వర్మ ఎంక్వైరీ నిర్వహించారు. ఆన్‌లైన్‌లో గుడిమళ్ళ వేంకటేశ్వరరావు సర్టిఫికెట్ సరైనదేనని నిర్ధారించడం జరిగిందన్నారు. గుత్తుల రమేష్, కాండ్రేగుల వేంకట శివ, ఎల్లమెల్లి వేంకటరమణవి ఐటీఐ సర్టిఫికెట్లు ఫేక్ అని వారిని తాత్కాలికంగా నిరుపేసామని కమిషనర్ తెలిపారు.