జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు
CTR: జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి కే. మోహన్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.