ట్యాంక్ బండ్ వద్ద భారీ క్రేన్లు.. 200 మంది గజ ఈతగాళ్లు..!

HYD: ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనానికి గణపతుల రాక ప్రారంభమైందని ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు GHMC కమిషనర్ కర్ణన్ వెల్లడించారు.14,486 మంది మూడు షిఫ్టులలో విధులు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాక కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కొనే విధంగా దాదాపు 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.