బాధిత కుటుంబీకులకు నారా భువనేశ్వరి పరామర్శ

తూ.గో: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా బిక్కవోలులో నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గుండెపోటుతో మృతిచెందిన రొక్కల రాణి కుటుంబీకులను ఆమె పరామర్శించి రూ.3లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నిరాహార దీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన సత్తయ్యను పరామర్శించి రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.