CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: వంగలపూడిలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పలు గ్రామాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఇనుగంటివారిపేట, బొబ్బిల్లంక, సింగవరం సహా ఆరు గ్రామాల లబ్ధిదారులకు రూ.19,850 నుంచి రూ.2,25,399 వరకు సాయం అందింది. అవసర సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.