కాంగ్రెస్ BCలను మోసం చేస్తుంది: వీరబాబు యాదవ్

కాంగ్రెస్ BCలను మోసం చేస్తుంది: వీరబాబు యాదవ్

SRPT: బీసీల హక్కుల పేరిట ధర్నా చేస్తోన్న కాంగ్రెస్ అసలైన ఉద్దేశం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడమేనని నడిగూడెం మండల BJP పార్టీ అధ్యక్షుడు వీరబాబు ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో వాగ్దానం చేసిన 42% బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కేటాయించబోతున్నారని, ఫలితంగా బీసీలకు కేవలం 32% మాత్రమే మిగిలిపోతుందని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ వ్యూహం వేసిందని విమర్శించారు.