రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
ఉక్రెయిన్‌తో యుద్దంలో రష్యాకు భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి ఉస్త్-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఆ పోర్టులోని గ్యాస్ టెర్నినల్ భారీగా దెబ్బతింది. దీంతో ఇంధన ఎగుమతులకు అంతరాయం ఏర్పడనుంది. తమ భూభాగంలోకి వచ్చిన కొన్ని డ్రోన్లను నాశనం చేశామని, దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.