ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరిన ఆర్వో ప్లాంట్లు
కోనసీమ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వం నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు శిథిలావస్థకు చేరడంతో అవి మరమ్మతులకు నోచుకోలేదు. ఇటీవల అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో ఉన్న హైస్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బూజు పట్టిన ఆర్వో ప్లాంట్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.