ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు 'ఓపెన్ హౌస్'
SRD: కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, EM విభాగంలో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం 'ఓపెన్ హౌస్' సెషన్‌ను నిర్వహిస్తోంది. పరిశోధనలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న సాయంత్రం 5:00 గంటలకు గూగుల్ మీట్ ద్వారా ఈ ఆన్‌లైన్ కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఐఐటీ ప్రతినిధులు కోరారు.