ఆర్టీసీ బస్ స్టాండ్‌లో విస్తృత తనిఖీలు
KRNL: ఢిల్లీలోని బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఇవాళ కర్నూలు RTC బస్ స్టాండ్‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు DSP జె. బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. ఇందులో సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్ స్టాండ్ అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.