హైదరాబాద్ లో ప్రధాని పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సాగుతోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన జరుగుతోంది. ముందుగా ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు.