కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

ఆదిలాబాద్‌లోని ప్రజాసేవ భవన్‌లో సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) గ్రామానికి చెందిన పలువురు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బేల మండలం నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండవర్ ఆధ్వర్యంలోనూ పలువురు పార్టీలో చేరారు. బేల సర్పంచ్ అభ్యర్థిగా పోత్లి వైశాలితో పాటు పలువురు వార్డ్ మెంబర్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సీనియర్ గిమ్మ సంతోష్ రావు తెలిపారు. ఈ చేరికలతో కాంగ్రెస్ పార్టీకి కొత్త బలం చేకూరింది.