నిత్యహారతి వేళల్లో మార్పు.!

నిత్యహారతి వేళల్లో మార్పు.!

E.G: రాజమండ్రి గోదావరి తీరంలోని పుష్కరఘాట్‌లో నిత్యహారతి వేళలు ఈ రోజు నుంచి మారుతున్నాయని హారతి పర్యవేక్షణాధికారి పీ. విశ్వనాథ రాజు పేర్కొన్నారు. వేసవి కాలం సూర్యాస్తమయ వేళలను దృష్టిలో ఉంచుకుని హారతి వేళలు మార్పు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ రోజు నుంచి అక్టోబరు 31 వరకు సాయంత్రం 7 నుంచి 7.20 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.