అండర్ పాస్ వద్ద నిలిచిన వర్షపు నీరు

అండర్ పాస్ వద్ద నిలిచిన వర్షపు నీరు

RR: గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తూరు వై జంక్షన్ వద్ద ఉన్న అండర్ పాస్ పూర్తిగా నీటిమయంగా మారింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్ వద్ద నిలిచిన వర్షపు నీటిని పోలీసులు మోటార్ల సహాయంతో తొలగిస్తున్నారు. దీంతో వాహనాలను పెంజర్ల ఎక్స్ రోడ్ వద్ద నుంచి మళ్లిస్తున్నారు. వాహనదారులు పోలీసులకు సహరించాలని కోరారు.