దక్షిణాఫ్రికాతో ఫైనల్.. ఆమెను కట్టడి చేయాలి..!
మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి అందుకోవాలని టీమిండియా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఫైనల్‌లో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్లను కట్టడి చేయాలి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్డ్ (470) అగ్రస్థానంలో ఉంది. దీంతో మన బౌలర్లు ఆమెను కట్టడి చేస్తే మిగిలిన వారిని అడ్డుకోవడం పెద్ద కష్టమేమి కాదని పలువురు మాజీలు అంటున్నారు.