కాలనీలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
ప్రకాశం: మార్కాపురం మండలంలో గత నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించడంతో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు వేములకోట, పెద్ద నాగులవరం గ్రామాలను సందర్శించారు. అలాగే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన 16, 17, 18 వార్డు సందర్శించి, బాధితులను పరామర్శించారు. వీరి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.