చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

NLR: ఓ వివాహితపై దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన బుజబుజనెల్లూరులో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మద్యం మత్తులో దారిన వెళ్తున్న మాబూన్నిసా, పిల్లలపై డ్రైవర్ విజయ్ కత్తితో దాడి చేశాడు. స్థానికులు గుర్తించి, ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.