'స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలి'

ELR: గణపవరంలో ఆర్అండ్‌బి రోడ్డు, డ్రైనేజీలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినవారు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి దార్ల శివరామ్ ప్రసాద్ తెలిపారు. గతంలో అనేక సార్లు మైక్, నోటీసుల ద్వారా సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో మంగళవారం మరోసారి నోటీసులు జారీచేశామన్నారు. నోటీస్ అందిన 7 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.