గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
NGKL: బల్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలిశెట్టిపల్లి గ్రామ శివారులో సుమారు 70 సంవత్సరాల వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు బల్మూరు ఎస్సై రాజేందర్ తెలిపారు. GSN కాలేజీ సమీపంలో వ్యక్తి మృతదేహం కనిపించిందని, తెలుపు బనియన్, నీలం షార్ట్ ధరించి ఉన్నాడని వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.